: ఆకట్టుకున్న ఆసీస్ ఓపెనర్లు... ప్రభావం చూపని భారత బౌలర్లు


ఆస్ట్రేలియా ఆటగాళ్లు మరోసారి సత్తాచాటుతున్నారు. తొలుత నిప్పులు చెరిగే బంతులతో రెండో టెస్టు తొలిరోజు రాణించి మ్యాచ్ ను తమ అధీనంలోకి తెచ్చుకున్న ఆసీస్ బౌలర్లకు దీటుగా, ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ కూడా ఆకట్టుకున్నారు. ఒపిగ్గా ఆడుతూ టెస్టు మజాను రుచిచూపిస్తున్నారు. 189 పరుగులకే టీమిండియా కుప్పకూలిన అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన డేవిడ్ వార్నర్ (23), రెన్ షా (15) లు జాగ్రత్తగా ఆచితూచి ఆడారు. దీంతో ఆసీస్ ఆటగాళ్లు పిచ్ నుంచి రాబట్టిన సీమ్, స్పిన్ ను టీమిండియన్లు రాబట్టలేకపోయారు.

దీంతో ఆసీస్ ఓపెనర్లు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా బ్యాటు ఝళిపించారు. ఈ రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లు ఆడిన ఆసీస్ ఓపెనర్లు వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేశారు. ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కాంబినేషన్లు ప్రయోగించిన కోహ్లీ ఆసీస్ బ్యాట్స్ మన్ పై ఎలాంటి ఒత్తిడి పెంచలేకపోయాడు. దీంతో రెండో టెస్టులో తొలి రోజు ఆసీస్ పైచేయి సాధించింది. 

  • Loading...

More Telugu News