: అమెరికా పెంచుతోంది.. మనమూ పెంచాలి!: ర‌క్ష‌ణ బ‌డ్జెట్‌పై చైనా కసరత్తులు


అమెరికా రక్షణ బడ్జెట్‌కు పరిమితులు ఉండరాదని చెబుతూ నావికాదళ విస్తరణ ప్రణాళికలపై చర్చించాలని నిన్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కీల‌క ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం రక్షణ రంగానికి కేటాయిస్తోన్న‌ 54 బిలియన్‌ డాలర్ల బ‌డ్జెట్‌ని మరో 10 శాతం పెంచాలని ట్రంప్ అన్నారు. అయితే, ఆ దేశానికి పోటీగా ఇప్పుడు చైనా కూడా త‌మ దేశ ర‌క్ష‌ణ రంగ బ‌డ్జెట్‌ను పెంచాల‌ని యోచిస్తోంది.  బీజింగ్‌లో స‌మావేశ‌మైన జాతీయ అసెంబ్లీ ర‌క్ష‌ణ‌శాఖ బ‌డ్జెట్‌ను పెంచాల‌ని నిర్ణ‌యం తీసుకుని ఆ అంశంపై ముందుకు వెళుతోంది. త‌మ దేశ ఆయుధ సంప‌త్తిని కూడా మ‌రింత పెంచాల‌ని యోచిస్తోంది. ప్ర‌స్తుతం ద‌క్షిణ చైనా దీవుల అంశంలో అమెరికాతో విభేదాలు ఉన్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News