: రానా, త్రిషల ప్రైవేట్ ఫొటోను లీక్ చేసిన గాయని సుచిత్ర


తెలుగులో ఎన్నో పాటలు పాడిన తమిళ గాయని సుచిత్ర కార్తీక్ సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది. పలువురు హీరో హరోయిన్లు చాలా క్లోజ్ గా ఉన్న ఫొటోలను అప్ లోడ్ చేసి, ఇప్పటికే సుచిత్ర సంచలనం రేపింది. తాజాగా రానా, త్రిషల ప్రైవేట్ ఫొటోను కూడా బయట పెట్టింది. రానా, త్రిషలు డీప్ లవ్ లో ఉన్నారని ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరి ప్రేమాయణం గురించి మీడియా ఎన్నిసార్లు ప్రశ్నించినా... తాము మంచి స్నేహితులం మాత్రమే అంటూ వీరు తప్పించుకునేవారు. ఆ సమయంలో, త్రిష బుగ్గపై రానా గాఢంగా ముద్దు పెడుతున్న ఓ ప్రైవేట్ ఫొటోను ఇప్పుడు సుచిత్ర లీక్ చేసింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అప్పట్లో రానాతో కలసి గోవాలో, పలు ఈవెంట్లలో త్రిష కెమెరాల కంటికి చిక్కింది. ఆ తర్వాత రానాకు దూరమైన త్రిష... వరుణ్ మణియన్ అనే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది. ఆ తర్వాత వీరి ఎంగేజ్ మెంట్ కూడా రద్దయింది. ప్రస్తుతం రానా, త్రిష ఇద్దరూ వారివారి సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే, ఇప్పుడు సుచిత్ర లీక్ చేసిన ఈ ఫొటో వీరిద్దరికీ కొంచెం ఇబ్బందిని కలిగించే అంశమే.

  • Loading...

More Telugu News