: రెండో టెస్టులో మళ్లీ సేమ్ సీన్...నిప్పులు చెరిగిన ఆసీస్ బౌలర్లు...టీమిండియా 189 ఆలౌట్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ బ్యాట్స్ మన్ బొక్కబోర్లాపడ్డారు. తొలి టెస్టు ఘోరపరాభవంతో బుద్ధొచ్చిందని, రెండో టెస్టులో ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడతామన్న కోహ్లీ మాటలు నీటిమూటల్లా తేలిపోయాయి. తొలిరోజే టీమిండియా బ్యాట్స్ మన్ 'పేపర్ టైగర్లు' అన్న ట్యాగ్ కు సుదీర్ఘకాలం తరువాత న్యాయం చేశారు. నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ బౌలర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. టీమిండియా ఆటలో సానుకూలాంశం ఏదైనా ఉందంటే, అది కేవలం ఓపెనర్ కేఎల్ రాహుల్ రాణించడం ఒక్కటే. ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ సహచరులు ఏమాత్రం ప్రతిఘటన లేకుండా వెనుదిరుగుతున్నా మొక్కవోని దీక్షతో ఒంటరి పోరాటం చేశాడు. దీంతో టీమిండియాలోని 8 మంది ఆటగాళ్లు సాధించిన మొత్తం పరుగుల కంటే ఎక్కువ స్కోరు చేశాడు.
దీంతో టీమిండియా 71 ఓవర్లలో 189 పరుగులు చేసింది. అనంతరం లియాన్ బంతిని అందుకోగా కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తూ నిరాశగా ఆడాడు. దీంతో 90 పరుగుల వద్ద అవుటయ్యాడు. దీంతో టీమిండియా 9వ వికెట్ ను కోల్పోయింది. తరువాతి బంతిని ఇషాంత్ యాదవ్ డిఫెన్స్ ఆడగా, హ్యాండ్స్ కొంబ్ ఒడిసిపట్టేశాడు. దీంతో ఉమేష్ యాదవ్ నాటౌట్ గా నిలిచాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లలో రాహుల్ (90), కరుణ్ నాయర్ (26), పుజారా (17), రహానే (17), కోహ్లీ (12), అశ్విన్ (7), జడేజా (3), సాహా (1), అభినవ్ ముకుంద్, ఇషాంత్ సున్నా పరుగులు చేశారు. అసీస్ బౌలర్లలో లియాన్ 8 వికెట్లతో అదరగొట్టగా, ఒకీఫ్, స్టార్క్ చెరో వికెట్ తీసి ఆకట్టుకున్నారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కేవలం 189 పరుగులు సాధించింది.