: ఇంతవరకు బాలీవుడ్ భామలకు దక్కని ఘనత అనుష్క శర్మకి దక్కింది!
‘ఎంట్రప్రెన్యూర్’ పత్రిక కవర్‌పేజీపై స్థానం దక్కించుకుని బాలీవుడ్ నటి అనుష్క శర్మ మరో ఘనత సాధించింది. ఇప్పటివరకు ఆ మ్యాగజైన్ ముఖచిత్రంపై కేవలం ఇద్దరు బాలీవుడ్ నటులు మాత్రమే స్థానం సంపాదించుకున్నారు. ఓ సారి షారుక్ ఖాన్ ఆ కవర్ పేజీపై కనిపించగా మరోసారి హృతిక్ రోషన్ కనిపించారు. ఈ కవర్ పేజీపై కనిపించిన మొదటి బాలీవుడ్ నటి కూడా అనుష్క శర్మనే. బాలీవుడ్‌లో నటిగా విజయాలు సాధిస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం ‘ఫిల్లోరి’ అనే సినిమాలో నటిస్తోంది. మరోపక్క నిర్మాతగానూ వ్యవహరిస్తూ బిజీబిజీగా ఉంటోంది. ఈ విషయాన్ని అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలుపుతూ ఆ ఫొటోను షేర్ చేసింది.