: జియోకు దీటుగా వొడాఫోన్ ఆఫర్... వొడాకి షాక్ ఇచ్చిన జియో!


జియో దెబ్బకు టెలికాం సంస్థలన్నీ విలవిల్లాడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు భారీ ఎత్తున వినియోగదారుల నుంచి వసూలు చేసిన టెలికాం సంస్థలన్నీ జియో దెబ్బకు దిగివచ్చాయి. ఊహించని విధంగా ఆఫర్లను ఎరవేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తన వినియోగదారులు జియోకు మరలకుండా వొడాఫోన్ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.

నెలకు 346 రూపాయల రీచార్జ్‌ పై 28జీబీ 4 జీ డేటా, అపరిమిత కాల్స్, ఎస్‌ఎమ్మెస్‌ లు లాంటి ప్రయోజనాలను అందించనుంది. అయితే ఈ ఆఫర్ మార్చి 15 వరకూ మాత్రమే చెల్లుబాటవుతుందని  వోడాఫోన్‌  తన ప్రకటనలో  తెలిపింది. జియో ప్రైమ్‌  మెంబర్‌ షిప్‌ కోసం వినియోగదారులు 99 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ  వోడాఫోన్‌ కస్టమర్లు ఇలాంటి ఫీజు లేకుండానే ఆ మంత్లీ ప్లాన్‌ ని ఎంజాయ్‌ చేయొచ్చని వొడాఫోన్ తెలిపింది.

దీంతో జియో మరో ఆఫర్ ప్రైమ్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. 303 రూపాయలతో రీచార్జ్‌ చేసుకునే ప్రైమ్‌ యూజర్లకు ఇదివరకు ప్రకటించిన విధంగా 28 జీబీ డేటా మాత్రమే కాకుండా అదనంగా మరో 5 జీబీ డేటాను అందిస్తున్నట్లు జియో తెలిపింది. అలాగే 499 రూపాయలతో రీచార్జ్‌ చేసుకుంటే 56 జీబీ డేటాతోపాటు10 జీబీ అదనపు డేటాను కూడా పొందవచ్చని జియో వెల్లడించింది. 

  • Loading...

More Telugu News