: మళ్లీ ఘోరంగా విఫలమవుతున్న టీమిండియా బ్యాట్స్ మెన్!


బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టు మ్యాచులో బ్యాటింగ్‌ కొన‌సాగిస్తోన్న టీమిండియా ఘోరంగా విఫ‌ల‌మ‌వుతోంది. ఓపెన‌ర్‌ అభినవ్‌ ముకుంద్, ఛ‌టేశ్వ‌ర పుజారా, విరాట్‌కోహ్లీ త‌క్కువ ప‌రుగుల‌కే అవుటైన విష‌యం తెలిసిందే. అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన ర‌హానే (17), నాయ‌ర్ (26) కూడా అవుటయ్యారు. మరో ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ మాత్రం క్రీజులో ఒంట‌రి పోరాటం చేస్తున్నాడు. ప్ర‌స్తుతం రాహుల్ 76 ప‌రుగులు, అశ్విన్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం ఐదు వికెట్ల న‌ష్టానికి 168 (59 ఓవర్లలో) ప‌రుగులతో ఆటకొనసాగిస్తోంది. స్టార్క్ , ఓకెఫీ లకు చెరో వికెట్ ద‌క్కగా లియాన్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

  • Loading...

More Telugu News