: బెంగళూరు టెస్టులోనూ నిరాశపరిచిన విరాట్ కోహ్లీ
భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఛటేశ్వర పుజారా అవుటయిన అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత అభిమానులను మరోసారి నిరాశపర్చాడు. మొదటి టెస్టులోనూ ఆయన ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. రెండో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్స్‌లోనూ ఆయన కేవలం 12 పరుగులకే లియాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. కోహ్లీ అవుటైన అనంతరం రహానే క్రీజులోకి వచ్చాడు. కాగా, ఓపెనర్ రాహుల్ మాత్రం క్రీజులో నిలదొక్కుకుని అర్ధసెంచరీ నమోదు చేసుకున్నాడు. రాహుల్ 62, రహానే 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు 113/3 (45 ఓవర్లకి) గా ఉంది. ఆసీస్ బౌలర్లలో లియాన్‌కి 2, స్టార్క్‌కి 1 వికెట్టు దక్కాయి.