: రాజశేఖర్ రెడ్డిని చంపించింది జగనే!: జేసీ సంచలన వ్యాఖ్యలు


వైపీసీ అధినేత జగన్ పై తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్న తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని జగనే చంపించాడని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి కోసం కన్న తండ్రినే చంపేశాడని అన్నారు. కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు తమను కాపాడుతున్నారంటూ జగన్ ఆరోపిస్తున్నారని... సీఎం తమను ఎలా కాపాడుతున్నారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో తాడిపత్రిలోని సాక్షి కార్యాలయం ముందు ఆయన ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ పై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కావాలంటూ జగన్ పగటి కలలు కంటున్నారని... కానీ ఆయన ఆశలు నెరవేరవని అన్నారు. 2019 ఎన్నికల తర్వాత నేనే ముఖ్యమంత్రి అంటూ రోడ్లపై జగన్ పిచ్చోడిలా తిరుగుతాడని జోస్యం చెప్పారు. జేసీ సోదరులపై అనవసర రాద్ధాంతం చేయడాన్ని జగన్ మానుకోవాలని సూచించారు. మరోవైపు, ధర్నా చేస్తున్న ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

  • Loading...

More Telugu News