: ఆ పరుపు ఖరీదు రూ.40 లక్షలు!
మ్యాట్రెస్ తయారీ రంగ సంస్థల్లో ఒకటైన హాస్టన్ సంస్థ తాజాగా అత్యంత ఖరీదైన పరుపును కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ పరుపు ధర అక్షరాల రూ.40 లక్షలు. దేశంలో మొదటిసారిగా ప్రీమియం రేంజ్ పరుపులను బెంగళూరు కేంద్రంగా ఆ సంస్థ అమ్ముతోంది. సన్రైజ్ హోం సొల్యూషన్ సంస్థతో కలసి హాస్టన్ ఇటీవలే ఈ పరుపులను విడుదల చేసింది. ఈ సంస్థకు చెందిన పరుపుల ప్రారంభ ధర రూ. 4.5 లక్షలుగా వుంది. ఇక గరిష్ట ధర రూ.40 లక్షలుగా ఉంది. హ్యాండీక్రాఫ్ట్ కావడం వల్లే ధర అధికంగా ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.