: లంచ్ విరామ సమయానికి టీమిండియా స్కోరు 72/2
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టు మ్యాచు మొదటి ఇన్నింగ్స్ లో ఈ రోజు లంచ్ విరామ సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 27.5 ఓవర్లలో 72 పరుగులు చేసింది. ఓపెనర్ అభినవ్ ముకుంద్ డకౌట్‌గా వెనుదిరిగిన అనంతరం క్రీజులోకి వచ్చి 17 పరుగులు చేసిన ఛటేశ్వర పుజారా లియాన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 48 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, లియాన్‌లకు చెరో వికెట్ దక్కాయి.
At Lunch on Day 1 of the 2nd @Paytm Test, India are 72/2 (Rahul 48*). Follow the game here https://t.co/Qj8RbwMTOS #INDvAUS pic.twitter.com/sKT2bd1T6k
— BCCI (@BCCI) 4 March 2017