: ఇమ్మిగ్రేషన్, హెచ్1బీ వీసాల గురించి అమెరికాతో చర్చించిన భారత్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నారైలు, ఆ దేశం వెళ్లాలనుకుంటున్న భారతీయుల పాలిట శరాఘాతంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో, అమెరికా ఉన్నతాధికారులతో భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ సమావేశమయ్యారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మిగ్రేషన్, హెచ్1బీ వీసాలపై వీరు చర్చించారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కాన్సస్ లో కూచిభొట్ల శ్రీనివాస్ పై జరిగిన కాల్పులను వ్యక్తిగత దాడిగానే భావిస్తున్నామని చెప్పారు.