: ప్రభాస్ కొత్త సినిమాలో బాలీవుడ్ హీరోయిన్, నటుడు?


'బాహుబలి' సినిమా కోసం నాలుగేళ్ల పాటు ఏకధాటిగా పని చేసిన ప్రభాస్... ఇప్పుడు తన కొత్త సినిమాపై దృష్టి సారించాడు. త్వరలోనే సుజిత్ డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగానే జరిగిపోతున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తీస్తున్నారు.

ఈ నేపథ్యంలో, ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయం తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించేందుకు ఓ బాలీవుడ్ హీరోయిన్ ను సెలెక్ట్ చేయాలనే యోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్టు సమాచారం. అంతేకాదు, ఓ ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. వివేక్ ఒబెరాయ్ కు తెలుగు, తమిళం, హిందీలో మంచి పేరు ఉంది. దీంతో, అతన్ని ఎంపిక చేసినట్టు సమాచారం. తెలుగులో 'రక్త చరిత్ర' సినిమాలో నటించిన వివేక్... ప్రస్తుతం తమిళంలో అజిత్ సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నాడు.  

  • Loading...

More Telugu News