: టీవీ ఛానెల్ షోకు ఇంకా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ట్రంప్.. దారుణంగా పడిపోయిన రేటింగ్స్
ఓ టీవీ ఛానెల్‌లో ప్రసారమవుతున్న ‘ద న్యూ సెలబ్రిటీ అప్రెంటిస్’ అనే షోకు హాలీవుడ్ స్టార్ అర్నాల్డ్ ష్వార్జనేగర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా ఇప్పుడు ఆ షోకు ఆదరణ తగ్గిపోయి విపరీతంగా రేటింగ్స్ పడిపోయాయి. ఎందుకంటే ఆ టీవీ షోకు ఇప్పటికీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా డొనాల్డ్ ట్రంపే కొనసాగుతున్నారు. గతంలో ట్రంప్‌ని వ్యతిరేకించిన అర్నాల్డ్ ఆ షోలో హోస్ట్‌గా ఇక వ్యవహరించనని తెగేసి చెప్పాడు. గతంతో అర్నాల్డ్ కాలిఫోర్నియా గవర్నర్ గా కూడా పనిచేశారు. వాస్తవానికి ప్రేక్షకులు తన షోను ఎంతగానో ఆదరిస్తున్నారని, అయితే ఆ షోకు ట్రంప్ ప్రొడ్యూసర్ అని తెలిసిన తర్వాత రేటింగ్స్ పడిపోయానని అర్నాల్డ్ చెప్పారు. దీంతో తాను ఆ షోను వదులుకుంటున్నట్లు తెలిపారు. ఒకప్పుడు ఈ షోకు రేటింగ్స్ అధికంగా ఉండేవి.