: హైదరాబాదు నుంచి చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం!


భారతీయ ఎయిర్ లైన్స్ సంస్థలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. వివిధ సంస్థల యాజమాన్యాలు, సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఎన్నెన్నో. తాజాగా చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానం హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలోనే నిలిచిపోయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే ఆపేశారు. ఈ నేపథ్యంలో, 120 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ లైన్స్ సిబ్బంది కూడా వీరిని పట్టించుకోవడం లేదు. ఈ విమానంలో టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News