: అఖిల్-శ్రియా భూపాల్‌ పెళ్లి రద్దు కారణంగా స‌మంత ఫ్యాన్స్‌కి తీవ్ర నిరాశ


దక్షిణాది అగ్ర హీరోయిన్‌ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతున్న చెన్నై బ్యూటీ సమంత‌కి అభిమానులు అధికంగానే ఉన్నారన్న విష‌యం తెలిసిందే. అయితే, అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్-శ్రియా భూపాల్ ల‌ పెళ్లి ర‌ద్దు కార‌ణంగా సమంత ఫ్యాన్స్‌కి నిరాశ ఎదుర‌వుతోంది. ఎందుకంటారా? వారిద్ద‌రి పెళ్లి ర‌ద్దుతో నాగ‌చైత‌న్య‌-స‌మంతల పెళ్లి అనుకున్న దాని కంటే ముందుగానే నిర్వ‌హించాల‌ని చూస్తున్నార‌ట‌. దీంతో ఇప్ప‌టికే సినిమాల్లో క‌నిపించ‌డం త‌గ్గించేసిన సమంత.. రాం చ‌ర‌ణ్ తేజ్‌-సుకుమార్‌ల‌ కాంబినేషన్ లో వ‌స్తోన్న సినిమాలోనూ కనిపించ‌బోద‌ని స‌మాచారం.

ఈ ఏడాది చివరిలో జరగాల్సిన  నాగ‌చైత‌న్య‌-స‌మంతల వివాహ వేడుక‌ అఖిల్ పెళ్లి రద్దు కారణంగా కాస్త ముందుకు తీసుకురావ‌డంతో సుకుమార్ సినిమాకి సమంత మ‌ళ్లీ నో చెప్పినట్టు తెలుస్తోంది. పెళ్లి అనుకున్న‌దానికి ముందే జ‌రుగుతున్న‌ కారణంగా షెడ్యూల్స్ కి ఇబ్బంది వచ్చే అవకాశం ఉండ‌డంతో స‌మంత ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని టాలీవుడ్ వ‌ర్గాల అంచ‌నా.

  • Loading...

More Telugu News