: బెంగళూరు టెస్ట్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా
ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో ఘోర ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా... రెండో టెస్టులో విజయం సాధించాలన్న కసితో బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో, ఇండియా టీమ్ లో రెండు మార్పులు జరిగాయి. తొలి టెస్టులో గాయపడ్డ మురళీ విజయ్ స్థానంలో అభినవ్ ముకుంద్ కు చోటు కల్పించారు. స్పిన్నర్ జయంత్ యాదవ్ ను పక్కన పెట్టారు. అతని స్థానంలో బ్యాట్స్ మెన్ కరుణ్ నాయర్ కు చోటు కల్పించారు.