: రూ.130కే వంద టీవీ చానెళ్లు.. డిస్ట్రిబ్యూటర్లకు ట్రాయ్‌ ఆదేశం


టీవీ చానళ్ల డిస్ట్రిబ్యూటర్లకు టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై నెలకు రూ.130కే వంద చానళ్లు అందించాలని ఆదేశించింది. ఆపై అందించే ప్రతి 25 చానళ్లకు కేవలం రూ.20 మాత్రమే వసూలు చేయాలని సూచించింది. అయితే దీనికి పన్నులు, వ్యాట్ అదనమని పేర్కొంది.

వంద ఫ్రీ టు ఎయిర్ చానళ్లకు ఇంతకు  మించి చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. పే చానళ్లు కావాలనుకుంటే ఆ సొమ్మును వినియోగదారుడే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. తాము చెప్పిన టారిఫ్ ఉచిత చానళ్లకు మాత్రమేనని వివరించింది. డిస్ట్రిబ్యూటర్లు ఫ్రీ, పే చానళ్ల రుసుమును ఏ నెలకు ఆ నెల తప్పనిసరిగా ప్రకటించాలని ఆదేశించింది. వినియోగదారుడు ఎంచుకున్న ప్యాకేజీ మార్చాలంటే అతడి నుంచి అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News