: రామ్ చరణ్ బద్ధకస్తుడు.. అల్లు అర్జున్ నన్ను టీజ్ చేసేవాడు!: నటి పవిత్రా లోకేశ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మరో నటుడు శర్వానంద్ ల పై కన్నడ సినీ నటి పవిత్రా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రామ్ చరణ్ బద్ధకస్తుడని, ‘స్వీట్ మదర్’ అంటూ అల్లు అర్జున్ తనను టీజ్ చేస్తుంటాడని ఆమె చెప్పింది. ‘నువ్వు పిల్లలను ఎప్పుడు కంటావు?’ అని రామ్ చరణ్ ను ఆమె అడిగినప్పుడల్లా..‘నేనే ఓ పిల్లాడిని. అప్పుడే, నాకు పిల్లలు ఏంటి?’ అని చెప్పేవాడని పవిత్రా లోకేశ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. శర్వానంద్ సహజ నటుడని, తన నటనను మరింత మెరుగుపరచుకునేందుకు అతను ప్రయత్నిస్తుంటాడని పవిత్ర మెచ్చుకుంది. కాగా, పలువురు యువ హీరోలకు ఆమె తల్లిగా నటించింది. తాజాగా, కాటమరాయుడు చిత్రంలో శ్రుతి హాసన్ కు, దువ్వాడ జగన్నాథం చిత్రంలో అల్లు అర్జున్ కు ఆమె తల్లిగా నటిస్తోంది.