: 16 మంది అందుబాటులో ఉన్నారు... కూర్పు రేపు చూస్తారుగా!: కుంబ్లే


16 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారని టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే తెలిపాడు. సమర్ధులైన ఆటగాళ్లు అందుబాటులో ఉండడం జట్టుకు మంచిదని చెప్పాడు. తానెప్పుడూ ఐదుగురు బౌలర్లతో మైదానంలో దిగాలని భావిస్తానని, అయితే పిచ్, పరిస్థితులు జట్టు కూర్పును నిర్ణయిస్తాయని తెలిపాడు. రేపటి మ్యాచ్ కు అంతా సన్నద్ధంగా ఉన్నారని అన్నాడు. అజింక్యా రహానేపై విశ్వాసముందని కుంబ్లే తెలిపాడు.

ఒకట్రెండు సిరీస్ లలో రాణించనంత మాత్రాన ఒక ఆటగాడి ప్రతిభను తక్కువ అంచనా వేయకూడదని కుంబ్లే సూచించాడు. రహానే పుంజుకుంటాడన్న విశ్వాసం తనకు ఉందని తెలిపాడు. గత మూడేళ్లుగా నిలకడగా ప్రదర్శన చేస్తున్న ఆటగాడు విఫలమైతే విమర్శలు సాధారణమని అన్నాడు, రహానే నైపుణ్యమున్న ఆటగాడని కుంబ్లే స్పష్టం చేశాడు. రేపు మైదానంలో సరికొత్త వ్యూహాలతో ఆటగాళ్లు దిగుతారని చెప్పాడు. బెంగళూరు పిచ్ లో ఫలితం వస్తుందని కుంబ్లే అన్నాడు. కాగా, చిన్నస్వామి స్టేడియం కుంబ్లే సొంత మైదానం కావడం విశేషం. 

  • Loading...

More Telugu News