: సన్నీలియోన్ ఎమోజీలు కూడా వస్తున్నాయ్!
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ బాటలో మరో నటి సన్నీ లియోన్ నడుస్తోంది. సోనమ్ కపూర్ ఇటీవల తన సొంత ఎమోజీలను ఆవిష్కరించింది. అదే బాటలో, సన్నీ కూడా పయనిస్తోంది. ఎమోజిఫై అనే యాప్ ద్వారా అన్ని మెసేజింగ్ ప్లాట్ ఫాంలలో సన్నీ ఎమోజీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు సదరు సంస్థతో సన్నీ లియోన్ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఎమోజీ ఫై సంస్థ సహ వ్యవస్థాపకురాలు మనన్ మహేశ్వరి మాట్లాడుతూ, సన్నీలియోన్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారని, తమ కంపెనీకి ఆమె సరైన వ్యక్తి అని అన్నారు. ప్రస్తుతానికి ఎమోజి ఫై యాప్ ఉచితంగా లభిస్తోందని, త్వరలోనే వీటికి ధర నిర్ణయిస్తామని, సన్నీలియోన్ ఎమోజీలను ఇండోనేషియాకు చెందిన డిజైనర్లు హైక్వాలిటీలో డిజైన్ చేశారని చెప్పారు. కాగా, సోనమ్ ఎమోజీలు తన యాప్ కు మాత్రమే పరిమితం కాగా, సన్నీ ఎమోజీలు అన్ని మెసేజింగ్ ప్లాట్ ఫాంలలో రానున్నాయి.