: శశికళకు మరో షాక్... దినకరన్ నిమాయకం చెల్లదన్న ఈసీ


జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన శశికళా నటరాజన్ కు మరోషాక్ తగిలింది. ముఖ్యమంత్రిగా రాష్ట్ర పగ్గాలు స్వీకరిద్దామని భావించిన శశికళకు సర్వోన్నత న్యాయస్థానం షాకిస్తూ...దోషిగా నిర్ధారించి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు ఖైదీగా పంపింది. అయినప్పటికీ పార్టీ, ప్రభుత్వంపై పట్టు సడలకూడదని బావించిన శశికళ పార్టీ పగ్గాలు తన బంధువు, నమ్మిన బంటు అయిన దినకరన్ కు అప్పగించింది. త్వరలోనే అతనిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా జైలు నుంచే అధికారం వెలగబెట్టాలని ప్రయత్నించింది.

ఈ నేపథ్యంలో ఈసీ దినకరన్ అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవికి ఎలా అర్హుడో వివరణ ఇవ్వాలని జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో దినకరన్ ఈసీకి తన వివరణ వినిపించారు. ఆయన వివరణతో ఏకీభవించని ఎన్నికల కమిషన్ ఆయన ఆ పదవికి అనర్హుడు అని స్పష్టం చేసింది. ఆయన ఎంపిక చెల్లదని స్పష్టం చేసింది. దినకరన్ అన్నాడీఎంకే ఆఫీస్ బేరర్ కాదని స్పష్టం చేసింది. దీంతో శశికళకు మరోసారి షాక్ తగిలినట్టైంది. 

  • Loading...

More Telugu News