: వాట్స్ యాప్ లో తలాక్ చెప్పిన హైదరాబాదీ ఎన్ఆర్ఐలు


ఇద్దరు ఎన్ఆర్ఐలు మతాచారాన్ని వినియోగించుకుని విడాకులిచ్చిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ముస్లిం మతాచారంగా ఆచరించే తలాక్ విధానంపై వివాదం నడుస్తోంది. అంతే కాకుండా తలాక్ విధానంపై పెద్దచర్చ నడుస్తోంది. ఈ విధానాన్ని ముస్లిం మహిళలంతా వ్యతిరేకిస్తుండగా, పురుషులు మాత్రం తమ మతాచారాన్ని మంటగలిపే చర్యగా భావిస్తూ ఆందోళనకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్ లో విధులు నిర్వహించేందుకు వెళ్లిన హైదరాబాదీ యువకులు సయ్యద్ ఫసియుద్దీన్, మహ్మద్ అబ్దుల్ అకీలాలు 2013లో తమ ప్రాంతమైన పాతబస్తీకే చెందిన యువతులను వివాహాలు చేసుకున్నారు. అనంతరం అమెరికా వెళ్లారు. తాజాగా వారిద్దరూ తమ భార్యలకు వాట్స్ యాప్ లో మూడు సార్లు తలాక్ చెప్పారు. దీంతో బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించారు. 

  • Loading...

More Telugu News