: కేరళ సీఎంకు గట్టి వార్నింగ్ ఇవ్వాల్సిందేనన్న సుబ్రహ్మణ్య స్వామి!
కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు, శ్రేణులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఘాటుగా స్పందించారు. ఈ దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. కేరళ రాష్ట్రంలో ఇదే విధంగా హింస కొనసాగితే, సీఎం పినరయి విజయన్ కు గట్టి వార్నింగ్ ఇవ్వాల్సిందేనని, అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని అన్నారు. కేరళ రాష్ట్రం నిండా జిహాదీలే ఉన్నారని, ఈ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ బలోపేతం కావడాన్ని సీపీఎం జీర్ణించుకోలేకపోతోందని, జాతీయవాదులను లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ దాడులకు పాల్పడుతోందని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. కాగా, నిన్న రాత్రి కల్లాచిలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు నాటుబాంబులతో దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముగ్గురు గాయపడ్డారు.