: జగన్ కు అధికారం పిచ్చి పట్టింది: జేసీ దివాకర్ రెడ్డి
వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు అధికారం పిచ్చి పట్టిందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఎప్పటికీ సీఎం కాలేరని అన్నారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద సంఘటనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని, బస్సు ప్రమాదం కేవలం మానవ తప్పిదమేనన్న విషయాన్ని వారు గ్రహించాలని జేసీ సూచించారు.