: నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలన్న కోరిక లేదు: అమలాపాల్ మాజీ భర్త


సోషల్ మీడియాలో గత కొంత కాలంగా వస్తున్న పుకార్లపై సినీ నటి అమలాపాల్‌ మాజీ భర్త విజయ్ స్పదించాడు. తాను రెండో వివాహం చేసుకుంటానంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని స్పష్టం చేశాడు. వాస్తవానికి తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. కొన్ని వార్తాపత్రికలు తన పెళ్లి గురించి కల్పిత కథలు రాశాయని  తెలిపాడు. అవి నిరాధారమైనవని స్పష్టం చేశాడు. వాస్తవాలు నిర్ధారించుకోకుండా వెలువడ్డ ఆ వార్తలు తనను బాధించాయని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఎదుగుదలలో మీడియా కీలక పాత్ర పోషించిందని చెప్పిన విజయ్, తనపై ఇలాంటి పుకార్లు రాయవద్దని స్పష్టం చేసే నైతికహక్కు తనకు ఉందని ఆయన అన్నాడు. ప్రస్తుతం తాను ప్రేక్షకులను అలరించే సినిమాలు తీయడంపైనే పని చేస్తున్నానని, దానికి అంతా సహకరించాలని కోరాడు. 

  • Loading...

More Telugu News