: ఆ పుస్తకాలు చదివితే నిజమైన జాతీయ వాదం తెలుస్తుంది: బీజేపీ నేతలకు అఖిలేష్ సూచన


నిజమైన జాతీయవాదం గురించి తెలుసుకోవాలంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన పుస్తకాలు చదవాలంటూ బీజేపీ నేతలకు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ సూచించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కేవలం ఓట్ల కోసమే పాకులాడుతున్న బీజేపీకి ఆ పుస్తకాలు చదవడం ద్వారా అసలైన జాతీయవాదం అంతే ఏమిటో బోధపడుతుందని, జాతీయవాదం పేరిట ప్రజలను మోసం చేయవద్దని బీజేపీ నేతలకు ఆయన హితవు పలికారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ - సమాజ్ వాదీ పార్టీ పొత్తు గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ఇది రెండు పార్టీల కూటమి కాదని, ఇద్దరు యువకులు కలిసి యూపీని అభివృద్ధి చేసేందుకు చేసుకున్న పొత్తు అని అఖిలేష్ అన్నారు. యూపీ ప్రజలు తమ పథకాల ద్వారా ఎంతో లబ్ధి పొందారని, వారి ఓట్లు తప్పకుండా తమకే పడతాయని, తమ కూటమి కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అఖిలేష్ దీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News