: ‘రీ మిక్స్’లపై సాయిధరమ్ తేజ్ కు మోజు తీరలేదా?


చిరంజీవి చిత్రాల్లోని పాత హిట్ పాటలను రీమిక్స్ చేసి వాటిని ‘మెగా’ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన సినిమాల్లో వాడుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి చిత్రాల్లోని ‘గోలిమార్’, ‘గువ్వా..గోరింకతో’, ‘అందం హిందోళం’ అనే పాటల రీమిక్స్ సాయి ధరమ్ తేజ్ చిత్రాల్లో ఇప్పటికే వచ్చాయి. అయితే, ఇకపై ‘రీ మిక్స్’ల జోలికి వెళ్లనని సాయిధరమ్ తేజ్ ఇటీవల ప్రకటించాడు.

కానీ, ‘స్టార్ మా’లో నిన్న ప్రసారమైన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన సాయిధరం తేజ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే, ‘రీ మిక్స్’పై మళ్లీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే, చిరంజీవి నటించిన నాటి చిత్రం ‘రాక్షసుడు’లోని ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు...’ అనే పాటను రీ మిక్స్ చేయాలని ఉందంటూ మెగాస్టార్ ముందే సాయిధరమ్ తేజ్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. దీంతో, రీమిక్స్ పాటలపై సాయి ధరమ్ తేజ్ కు మోజు తీరలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News