: కలెక్టరే జగన్ చొక్కా పట్టుకుని లాగారు: వైసీపీ
కృష్ణా జిల్లా నందిగామ ఆసుపత్రి వద్ద జిల్లా కలెక్టర్ పట్ల వైసీపీ అధినేత జగన్ దురుసుగా ప్రవర్తించారంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అరుణ్ కుమార్ మండిపడ్డారు. వాస్తవానికి కలెక్టరే జగన్ షర్టు పట్టుకుని లాగారని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని... ఆధారాలతో తాము కోర్టుకు వెళతామని అన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో వచ్చిన జగన్ కు కనీస రక్షణ ఏర్పాట్లు కూడా చేయలేదని ఆయన విమర్శించారు. టీడీపీ గూండాలతో జగన్ కు వ్యతిరేకంగా కలెక్టర్, పోలీసులు నినాదాలు చేయించారని మండిపడ్డారు. దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని కాపాడేందుకే... జగన్ పై కేసు నమోదు చేయించారని అన్నారు. టీడీపీ ఏజెంట్ లా ప్రవర్తించిన కలెక్టర్ కు ఐఏఎస్ అధికారుల సంఘం మద్దతు తెలపడం బాధాకరమని చెప్పారు.