: వివో స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,990 త‌గ్గింపు!


ప్రముఖ మొబైల్ ఉత్ప‌త్తుల కంపెనీ వివో తన ‘వివో వై 51 ఎల్‌’ స్మార్ట్‌ఫోన్ పై తగ్గింపు ధరను ప్రకటించింది. ఈ మొబైల్ ‌ను గ‌త ఏడాది జనవరిలో ప్రారంభించిన సంస్థ కొన్ని నెల‌ల‌కు దాని రేటును కొద్దిగా త‌గ్గించ‌గా, ప్ర‌స్తుతం ఆ మొబైల్ ధ‌ర‌ రూ.11,980గా ఉంది. అయితే, తాజాగా ఈ డివైస్ ధ‌రను ఇప్పుడు మ‌రో 2,990 రూపాయ‌లు త‌గ్గించి, రూ.8,990 లకే ఇస్తున్న‌ట్లు తెలిపింది. ఈ మొబైల్  2350 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామ‌ర్థ్యంతో 5 అంగుళాల ఐపీఎస్‌ స్క్రీన్‌, ఆండ్రాయిడ్ 540x960 పిక్సెల్‌ రిజల్యూషన్‌, 2జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్ సామ‌ర్థ్యం, 128 జీజీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్ సామ‌ర్థ్యం, 8 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ ముందు కెమెరా ఫీచ‌ర్లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News