: అమరావతిలో తొలి శాసనసభ సమావేశాలకు ప్రకటన జారీ.. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్!
ఆంధ్రప్రదేశ్ నవ్యరాజధాని అమరావతిలోని వెలగపూడిలో నిర్మించిన నూతన అసెంబ్లీ భవనం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా నిన్న ఉదయం 11.25కు ప్రారంభమయిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సిబ్బంది ఇప్పటికే ఆ భవనంలో విధులను కూడా ప్రారంభించారు. ఏపీలో జరగనున్న తొలి అసెంబ్లీ సమావేశాలకు కొద్ది సేపటిక్రితం గవర్నర్ నరసింహన్ ప్రకటన జారీ చేశారు. ఈ నెల 6న ఉదయం 11.06 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయని అందులో పేర్కొన్నారు. సభ ప్రారంభం కాగానే ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.