: ద‌లైలామా పర్యటనకు అనుమతిస్తే తీవ్ర పరిణామాలుంటాయి: భారత్ ను మరోసారి హెచ్చరించిన చైనా


బౌద్ధ మ‌త గురువు ద‌లైలామా ఏ దేశంలో ప‌ర్య‌టించినా ఆ దేశంపై నిప్పులు చెరిగే చైనా తాజాగా భార‌త్‌కు వార్నింగ్ ఇచ్చింది. ద‌లైలామా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లో ప‌ర్య‌టించాల‌ని యోచిస్తోన్న నేప‌థ్యంలో ఆ ప‌ర్య‌ట‌న‌కు భార‌త్‌ అనుమ‌తిస్తే బాగుండ‌ద‌ని, చైనా, భార‌త్ మ‌ధ్య సంబంధాలు దారుణంగా దెబ్బ‌తింటాయ‌ని పేర్కొంది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ని ద‌క్షిణ టిబెట్‌గా చెప్పుకుంటున్న చైనాతో, భార‌త్‌కు ఎన్నో ఏళ్లుగా విభేదాలు కొన‌సాగుతున్నాయి.

మ‌రోవైపు టిబెట్ స్వాతంత్ర్యం కోసం ద‌లైలామా ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నారు. దలైలామాను చైనా ఇప్పటికీ వేర్పాటువాదిగా భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో ప‌ర్య‌టించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వ‌స్తున్న వార్త‌లు తీవ్రంగా ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌ని చైనా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. వివాదాస్పద ప్రాంతాల్లో దలైలామా ప‌ర్య‌ట‌న‌ను త‌మ దేశం తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంద‌ని తెలిపింది. ఆ ప్రాంతంపై త‌మ విధానంలో ఎలాంటి మార్పు లేదని మ‌రోసారి వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News