: కేసీఆర్ లాంటి నేత కావాలని ఆంధ్రా ప్రజలు కోరుకుంటున్నారు: ఈటల రాజేందర్


తెలంగాణలో సుపరిపాలనను చూస్తున్న ఏపీ ప్రజలు ఓ కేసీఆర్ లాంటి నేత తమకూ కావాలని కోరుకుంటున్నారని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజనతో రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని అన్నారు. కానీ, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం తెలంగాణపై చేస్తున్న వ్యాఖ్యలు బాధిస్తున్నాయని అన్నారు. హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని చెబుతున్న చంద్రబాబు, తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడటం ఎంత వరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు తెలుగు ప్రజల మధ్య సామరస్యం దెబ్బతినేలా ఉంటున్నాయని ఆయన విమర్శించారు. తెలుగు ప్రజల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయత ఉండాలని, అన్నదమ్ముల్లాగా కలసి మెలసి ఉండాలని కోరుకుంటున్నామని ఈటల పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News