: బాధిత జర్నలిస్టులను క్షమాపణ కోరిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్


బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సంజయ్‌ దత్ బాడీగార్డులు ఈ రోజు మీడియా ప్ర‌తినిధుల‌పై దాడి చేసిన విష‌యం తెలిసిందే. దీంతో సంజ‌య్‌పై పోలీసులు కేసు కూడా నమోదు చేయ‌డంతో ఈ వార్త ఇప్పుడు అంత‌టా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ దాడి జరుగుతున్నప్పుడు సంజయ్ దత్ అక్కడే ఉన్నప్పటికీ ఏమీ ప‌ట్ట‌న‌ట్లు వెళ్లిపోయినట్టు విలేక‌రులు చెబుతున్నారు. దీంతో సంజ‌య్ ద‌త్ స్పందించాడు. మీడియా ప్రతినిధులకు తాను క్షమాపణ చెబుతున్న‌ట్లు ఓ ప్రకటన విడుదల చేశాడు. జర్నలిస్టులపై దాడి తప్పేనని అన్నాడు.  

  • Loading...

More Telugu News