: మా అబ్బాయిని ‘లిటిల్ జాన్’ అని నేను ఎందుకు పిలవాలి?: కరీనా కపూర్


గత డిసెంబర్ లో బాలీవుడ్ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ లకు మగబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. ఆ చిన్నారికి ‘తైమూర్’ అని పేరు పెట్టడం, దానిపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవడం తెలిసిందే. తాజాగా, ఆ చిన్నారిని ‘తైమూర్’ కు బదులుగా ‘లిటిట్ జాన్’ అనే పేరుతో కరీనా పిలుచుకోవాలనుకుంటోందనే వార్తలు హల్ చల్ చేశాయి.

ఈ నేపథ్యంలో ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీనా మాట్లాడుతూ, ‘నో.. ఈ విషయమై స్పష్టంగా చెప్పాలని అనుకుంటున్నాను. ఎవరైనా ఇలాంటి ఆలోచనలు ఎలా చేస్తారు? నా పిల్లవాడిని ‘లిటిట్ జాన్’ అని నేను ఎందుకు పిలవాలి?  నా బిడ్డ పేరు ‘తైమూర్’. ఇది చాలా అందమైన పేరు, వాడి నవ్వులూ చాలా అందంగా ఉంటాయి. వాడిని తైమూర్ అనే పిలుస్తాను.. ‘లిటిల్ జాన్’ అని పిలిచే ప్రసక్తే లేదు. దయచేసి, నా బిడ్డను తైమూర్ అలీ ఖాన్ పేరుతోనే పిలవండి’ అని ఆ ఇంటర్వ్యూలో కరీనా కపూర్ చెప్పింది.

  • Loading...

More Telugu News