: పాతనోట్లు కలిగి ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పెద్దనోట్ల రద్దు అనంతరం భారీ మొత్తంలో డబ్బుని మార్చుకుంటూ అనేక మంది నల్లకుబేరులు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. అయితే, బ్యాంకుల్లో జమ చేయకుండా ఇంకా పాతనోట్లు కలిగి ఉండి పట్టుబడితే నేరంగా పరిగణిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ పాతనోట్లను మార్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కేటుగాళ్లు. ఈ క్రమంలో కోల్‌కతాలో పాతనోట్లను కలిగివున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ఏకంగా రూ.51లక్షల పాతనోట్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. వీరు ఓ ఏజెంట్ ద్వారా పాతనోట్లను మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని, వెంటనే అక్కడకు చేరుకొని పట్టుకున్నామని చెప్పారు.