: చెడ్డ పేరు తీసుకురాకుండా పనిచేయండి: కవిత


ప్రజలు తమ స్మార్ట్ ఫోన్ నుంచే తమ సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు తయారు చేసిన ప్రజావాణి యాప్ ను టీఆర్ఎస్ ఎంపీ కవిత నేడు ప్రారంభించారు. నిజామాబాద్ కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ లో ఈ యాప్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా అధికారులంతా పని చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్, జిల్లా పరిషత్ ఛైర్మన్ రాజు, కలెక్టర్ యోగితారాణి తదితరులు పాల్గొన్నారు.


  • Loading...

More Telugu News