: దాసరి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్న ‘మా’ కొత్త అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి
అనారోగ్య సమస్యలతో కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన కేంద్ర మాజీ మంత్రి, దర్శకుడు దాసరి నారాయణ రావు ఇంకా అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఆయనను ఈ రోజు సినీ నటులు శివాజీ రాజా, నరేష్‌లు పరామర్శించారు. రెండు రోజుల క్రితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ పదవీకాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడిగా నటుడు శివాజీరాజాను ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. గతంలో దాసరి నారాయణరావు మాట్లాడుతూ, 'మా' అధ్యక్షుడుగా శివాజీ రాజా, జనరల్ సెక్రటరీగా నరేష్‌లు ఉండాలని ఆకాంక్షించారు. ఈ సారి అలాగే జరగడంతో దాసరి హర్షం వ్యక్తం చేశారు. వారిరువురూ ఈ రోజు దాసరి ఆశీర్వాదం తీసుకున్నారు.