: అలాంటి మగాళ్లు ఊర్మిళలా పోజు లివ్వరు: టైగర్ ష్రాఫ్ పై వర్మ సెటైర్


బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ నిన్న తన 28వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా బాలీవుడ్ సహా పలువురు ప్రముఖులు టైగర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. అయితే, సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం  టైగర్ కు విషెస్ చెప్పడానికి బదులు తన దైన శైలిలో ఓ సలహా ఇచ్చాడు.

‘బాఘీ’ చిత్రంలో బీచ్ లో చొక్కా లేకుండా టైగర్ ష్రాఫ్ నడుచుకుంటూ వస్తున్న ఓ ఫొటోను పోస్ట్ చేసి మరీ, ఈ సలహా ఇచ్చాడు. అదేమిటంటే, ‘బికినీ బేబీలా పోజులు ఇచ్చుంటే బ్రూస్లీ అంతటి మొనగాడు అయ్యేవాడు కాదు. అలాంటి మగాళ్లు ఊర్మిళలా పోజులివ్వరు. మీ నాన్న జాకీష్రాఫ్ కి నీ లాగా సిక్స్ ప్యాక్ లు లేవు. అయినా, జాకీష్రాఫ్ మ్యాన్లీగా ఉంటాడు’ అని వర్మ పేర్కొన్నాడు. అంతేకాకుండా, జాకీష్రాఫ్ పై తనకు ఉన్న అభిమానం కారణంగానే టైగర్ ష్రాఫ్ గురించి ఈ ట్వీట్లు చేస్తున్నానని, ఈ విషయాన్ని భార్య ఆయేషా ష్రాఫ్ కు, కొడుకు టైగర్ కు చెప్పాలని జాకీ ష్రాఫ్ కి వర్మ సలహా ఇచ్చాడు. 

  • Loading...

More Telugu News