: విద్యార్థుల సమస్యలపై ఏపీ మంత్రి గంటాకు పవన్ కల్యాణ్ సూచనలు!


నెల్లూరు కేంద్రంగా నడుస్తున్న విక్రమ సింహపురి యూనివర్శిటీలో జరుగుతున్న అక్రమాలు, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ కు పవన్ కల్యాణ్ పలు సూచనలు చేశారు.  అక్రమాలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేసిన ఆయన, సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. సమస్యల విషయం ప్రభుత్వం దృష్టికి విద్యార్థులు తీసుకువచ్చినా, ఎందుకు స్పందించలేదని ప్రశ్నించిన ఆయన, ఈ విషయంలో విద్యార్థులకు అన్యాయం జరిగితే, వారి వెనుక తాను అండగా ఉంటానని అన్నారు. వెంటనే వర్శిటీని సందర్శించి విద్యార్థులతో మాట్లాడాలని గంటాకు సూచించారు.

  • Loading...

More Telugu News