: తీవ్ర కోపంతో తన అభిమాని సెల్ ఫోన్ ను పగులగొట్టిన సినీనటుడు ప్రకాష్ రాజ్
సినీనటుడు ప్రకాష్ రాజ్ ఇటీవలే రెండు వేర్వేరు ఘటనల్లో విలేకరులతో గొడవకు దిగి వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. కావేరీ జలాల వివాదం, జల్లికట్టు అంశాలపై తనను ప్రశ్నించగా ప్రకాష్‌రాజ్ మీడియా ప్రతినిధులకు చివాట్లు పెట్టాడు. తాజాగా తన అభిమానిపై కూడా ప్రకాష్ రాజ్ అంతకన్నా కఠినంగా వ్యవహరించాడు.
చెన్నై విమానాశ్రయంలో ప్రకాష్ రాజ్‌ను చూసిన ఓ అభిమాని ఆయనతో సెల్ఫీ తీసుకోవాలని ముచ్చటపడి, అందుకోసం ప్రయత్నించాడు. అయితే, ఆ అభిమానిపై తీవ్ర కోపం వ్యక్తం చేసిన ప్రకాష్‌రాజ్ ఆ అభిమాని ఫోన్‌ను లాక్కొని నేలకేసి పగులగొట్టాడు. దీంతో ఆ అభిమాని ఇష్టం లేకపోతే వద్దని చెబితే సరిపోయేది కదా? అని మండిపడ్డాడు. వెంటనే విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే, అప్పటికే ప్రకాష్ రాజ్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోయాడు.