: హీరోయిన్ చిత్రాన్ని నకిలీ పాస్ పోర్టుపై ముద్రించిన ఎన్నారై... తొమ్మిదేళ్ల జైలు శిక్ష


కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చేందుకు అడ్డదారి తొక్కిన భారత అమెరికన్ అమిత్ చౌదరిని అరెస్ట్ చేసిన ఎఫ్బీఐ అధికారులు అలెగ్జాండ్రియా ఫెడరల్ కోర్టు ముందు నిలుపగా, 9 సంవత్సరాల జైలు శిక్ష పడింది. నకిలీ పాస్ పోర్టును సృష్టించిన అమిత్, దానిపై అమెరికాలో ఫేమస్ అయిన బుల్లితెర హీరోయిన్ లారా వండెర్ వూట్ చిత్రాన్ని దానిపై ఉంచడంతో, దాన్ని చూసిన ఎఫ్బీఐ అధికారికి వచ్చిన అనుమానం, తొలుత విచారణకు, ఆపై అమిత్ అరెస్టుకు దారితీసింది.

నగదు అక్రమ బదిలీ కుంభకోణాన్ని జరిపిన ఆయన లక్షల డాలర్లు సంపాదించాడని అధికారులు తెలిపారు. తక్కువ ధరకు ప్రయాణ ప్యాకేజీలు అందిస్తానని చెబుతూ, ఇతరుల క్రెడిట్ కార్డు వివరాలు సేకరించి, షెల్ బ్యాంకు ఖాతాల ద్వారా ఆ డబ్బు నొక్కేసేవాడు. నొక్కేసిన డబ్బుతో వారి ప్రయాణ, హోటల్ బిల్లులు కట్టేవాడు. ఇండియాలో అమెరికన్ ఎక్స్ ప్రెస్ సంస్థలో పనిచేస్తున్న ఓ వ్యక్తిని తన టీములో చేర్చుకుని కార్డుల క్లోనింగ్ విధానంలో నకిలీ కార్డులను తయారు చేసి 25 మిలియన్ డాలర్లు నొక్కేశాడు. టీవీ నటి చిత్రంతో నకిలీ పాస్ పోర్టు సృష్టించిన తరువాత అతను నేరం చేశాడని తేల్చిన కోర్టు జైలు శిక్షను విధించింది. ఇదే కుంభకోణంలో తనతో పాటు మరికొందరికి కూడా సంబంధముందని చెప్పడంతో, పోలీసులు ఆ దిశగా కదిలారు.

  • Loading...

More Telugu News