: పసిఫిక్ తీరంలో మకాం వేసిన గ్రహాంతరవాసుల సైన్యం... సోషల్ మీడియాలో చిత్రాల హల్ చల్


దాదాపు 2 మైళ్లకు పైగా చదరపు విస్తీర్ణంలో సుదూర అంతరిక్షం నుంచి భూమిపై దాడి చేసేందుకు వచ్చిన ఏలియన్స్, తమ సైన్యపు బేస్ ను ఏర్పాటు చేసుకున్నాయని చెబుతూ 'సెక్యూర్ టీం 10' అనే వెబ్ సంస్థ ప్రచురించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పసిఫిక్ సముద్ర తీరంలో ఈ బేస్ ఉందని, భూమిపై దాడి చేసేందుకు వ్యూహరచనను అవి చేస్తుండవచ్చని తెలిపింది. మహాసముద్రం తమకు క్షేమమని భావిస్తూ, ఏలియన్స్ అక్కడ ఉండి వుండవచ్చని పేర్కొంది. కాగా, ఈ చిత్రాలను పరిశీలించిన కొందరు నిపుణులు ఏలియన్ బేస్ గా భావిస్తున్న ప్రాంతం పెద్దదిగానే కనిపిస్తోందని అన్నారు. కాగా, ఈ విశ్వాంతరాళంలో మరో జీవి ఉనికి కచ్చితమని, అది మానవుని కన్నా ఎంతో శక్తిమంతమని ప్రముఖ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్స్ అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News