: ఆ టెక్కీని సేఫ్ గా ఇల్లు చేర్చాం: క్యాబ్ లో కీచకపర్వంపై సీపీ భగవత్


విజయవాడ వెళ్దామని క్యాబ్ ను ఆశ్రయించి లైంగిక వేధింపులకు గురైన మహిళా టెక్కీని క్షేమంగా ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చామని సీపీ భగవత్ వెల్లడించారు. క్యాబ్ లో అరాచక ఉదంతంపై మీడియాతో మాట్లాడిన ఆయన, ఇద్దరు కానిస్టేబుళ్లను తోడుగా ఇచ్చి, గుంటూరులోని ఆమె ఇంటికి చేర్చామని తెలిపారు. ఏపీ 28 టీవీఏ 0051 నంబరుగల కారులో యువతిని ఎక్కించుకుని అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. ఎల్బీ నగర్ పరిధిలో కేసు నమోదు చేశామని, ఐపీసీ సెక్షన్ 354 కింద రిజిస్టర్ చేశామని వెల్లడించారు. నిందితులను రిమాండ్ కు పంపినట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News