: అమర్ సింగ్ ముఖాన్ని టీవీలో కూడా చూడొద్దని పిల్లలకు చెప్పాను: డింపుల్ యాదవ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. అమర్‌సింగ్‌పై విమర్శలు గుప్పించారు. ఆయన చేస్తోన్న వ్యాఖ్యలను లెక్కచేసేది లేదని అన్నారు. ఆయన ముఖాన్ని తన పిల్లలను టీవీలో కూడా చూడనివ్వనని అన్నారు. అమర్‌సింగ్ ముఖం టీవీలో వస్తే వెంటనే టీవీ ఆఫ్ చేసేస్తానని చెప్పారు. మరోవైపు ఆ రాష్ట్రంలో ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేశారన్న ఆరోపణలున్న గాయత్రీ ప్రజాపతిని కాపాడేందుకు సమాజ్‌వాదీ పార్టీ నేతలు చూస్తున్నారన్న విషయంపై ఆమె మాట్లాడుతూ... అందులో నిజం లేదని పేర్కొన్నారు. తాము చట్టాన్ని గౌరవిస్తామని చెప్పిన డింపుల్ యాదవ్.. నేరాలు చేసినవాళ్లు ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు.