: ఈ వార్త నిజమైతే.. కాజల్ ఇక సినిమాలకు దూరమవుతున్నట్టే!
టాలీవుడ్ లో దాదాపు దశాబ్ద కాలంగా అగ్ర హీరోయిన్ గా కొనసాగుతోంది కాజల్ అగర్వాల్. కోలీవుడ్ లో కూడా ఈ ముద్దుగుమ్మ బిజీగానే ఉంది. బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. ఇంత బిజీగా ఉన్న ఈ అమ్మడు గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఓ బిజినెస్ మెన్ తో కాజల్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందనేదే ఈ వార్త. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ఇదే కనుక నిజమైతే... ఇంతకాలం వెండి తెరపై రంజింపజేసిన కాజల్ ఇకపై సినీ అభిమానులకు దూరమైనట్టే.
కాజల్ ప్రియుడికి దేశవ్యాప్తంగా చైన్ హోటల్ బిజినెస్ ఉందట. వీరిద్దరూ సమయం దొరికినప్పుడల్లా కలుసుకుంటున్నారట. ఇప్పుడు తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసేని... పెళ్లి పీటలు ఎక్కాలని కాజల్ భావిస్తోందట.