: హైదరాబాద్ శ్రీవాసవి ఇంటర్ కాలేజ్ నిర్వాహకుల అరెస్ట్
హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీ వాసవీ ఇంటర్ కాలేజ్ నిర్వాహకుల కారణంగా సుమారు 250 మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి హాల్‌టికెట్లు అందని విషయం తెలిసిందే. ఆ కాలేజీ ముందే కాక ఇంటర్‌బోర్డు ముందు కూడా విద్యార్థులు నిరసనకు దిగినా ఫలితం లేకుండా పోయింది. విద్యార్థుల నుంచి ఫీజు సేకరించి కూడా బోర్డుకు కట్టకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఆ కాలేజీపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజు ఆ కాలేజీ నిర్వాహకులు శీనయ్య, శ్యాంసుందర్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.