: అనితా.. టీడీపీలో నాకు పట్టిన గతే, రేపు నీకు కూడా పడుతుంది: రోజా

టీడీపీ ఎమ్మెల్యే అనితపై వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మండిపడ్డారు. తనను తిడితే పబ్లిసిటీ వస్తుందని, పదవులు వస్తాయని అనిత భావిస్తున్నట్టుందని ఆమె ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా అనితను రోజా హెచ్చరించారు. "అనితా, టీడీపీలో ఉన్నప్పుడు నాకు పట్టిన గతే... రేపు నీకు కూడా పడుతుంది" అని రోజా అన్నారు. ఏపీ కేబినెట్ సమావేశం జరిగిన తీరును చూస్తుంటే... టీడీపీ ప్రభుత్వం తమ అధినేత జగన్ ను చూసి భయపడుతున్నట్టుందని చెప్పారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 11 మంది ప్రాణాలను బలిగొన్న దివాకర్ ట్రావెల్స్ పై కేసు ఎందుకు నమోదు చేయలేదని ఆమె ప్రశ్నించారు.