: ఇప్పటివరకు రూ.70 వేల కోట్ల నల్లధనాన్ని వెలికితీశాం!: వివరాలు వెల్లడించిన సిట్‌


దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఛిన్నాభిన్నం చేస్తోన్న న‌ల్ల‌ధనాన్ని వెలికితీయ‌డానికి సుప్రీంకోర్టు నియ‌మించిన‌ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఇప్ప‌టివ‌ర‌కు బ‌య‌టకు తెచ్చిన న‌ల్ల‌ధ‌న వివ‌రాల‌ను తెలిపింది. సిట్‌ డిప్యూటీ చైర్మన్‌ అరిజిత పసాయత వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ మొత్తం రూ.70 వేల కోట్ల నల్లధనాన్ని వెలికితీశామని చెప్పారు. ఇందులో రూ.16 వేల కోట్లు విదేశాల్లో గుర్తించామని తెలిపారు. న‌ల్ల‌ధ‌నంపై ఉక్కుపాదం మోపిన కేంద్ర స‌ర్కారు ప్రకటించిన వివిధ పథకాల ద్వారా ఈ మొత్తం వెలుగులోకి వచ్చిందని అరిజిత పేర్కొన్నారు. ఈ మేర‌కు త‌మ ఆరో నివేదికను వ‌చ్చేనెల‌లో సుప్రీంకోర్టుకు సమర్పిస్తామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News