: రజనీకాంత్ తో ఎమ్మెల్యే కరుణాస్ భేటీ... తమిళ రాజకీయాల్లో కొత్త ఆలోచనలు!


దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ను తిరువాడనై ఎమ్మెల్యే, నటుడు తరుణాస్ కలవడం తమిళనాడు రాజకీయాల్లో మరోసారి కొత్త చర్చకు తెరలేపింది. రజనీ ఇంటికి వెళ్లిన కరుణాస్, దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్యా జరిగిన చర్చల వివరాలు వెల్లడి కానప్పటికీ, రజనీని బీజేపీ తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోందన్న ఊహాగానాలు వస్తున్న వేళ, శశికళ శిబిరంలో ఉండి, నియోజకవర్గ ప్రజల వ్యతిరేకతను చవిచూసిన కరుణాస్ ఆయన్ను కలవడంతో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి.

కాగా, వీరి భేటీ అనంతరం కరుణాస్ మీడియాతో మాట్లాడుతూ, తాను మర్యాద పూర్వకంగా ఆయన్ను కలిశానని, సూపర్ హిట్ చిత్రం 'బాషా'ను డిటిటలైజ్ చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపానని అన్నారు. ఆయనంటే తనకు అభిమానమని, తనకు రజనీ కొన్ని సలహాలు ఇచ్చారని తెలిపారు.

  • Loading...

More Telugu News